ICC Champions Trophy: త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టులోకి ఆ ముగ్గురు రీ ఎంట్రీ! 1 d ago
ఫిబ్రవరి 19 నుంచి ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. టీమ్ ఇండియాతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్లకు త్వరలోనే జట్లను ప్రకటించనుంది బీసీసీఐ. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆడించే అవకాశముంది. కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్ , అర్షదీప్ సింగ్లను ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు ఎంపిక చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇటీవల దేశవాళీ క్రికెట్ లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జనవరి 12 వరకు ప్రొవిజనల్ జట్లను ప్రకటించాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 13 వరకు అందులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.